Chiranjeevi : ‘మన ఊరి పాండవులు’ మూవీలో చిరు యాక్టింగ్ చూసి.. మహానటి సావిత్రి ఏమన్నారో తెలుసా..!
'మన ఊరి పాండవులు' మూవీలో చిరంజీవి యాక్టింగ్ చూసి మహానటి సావిత్రి ఒక మాట అన్నారట. అతను ఎవరో గాని..
- By News Desk Published Date - 08:09 PM, Mon - 1 April 24

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 1978లో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. చిరంజీవి నటించిన మొదటి మూవీ ‘పునాదిరాళ్ళు’. అయితే అది రిలీజ్ అవ్వడం ఆలస్యం అయ్యింది. దీంతో ‘ప్రాణం ఖరీదు’ ముందుగా థియేటర్స్ లోకి వచ్చి.. చిరంజీవిని ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సినిమా తరువాత చిరంజీవి నుంచి రిలీజైన రెండో చిత్రం ‘మన ఊరి పాండవులు’. కృష్ణంరాజు, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సపోర్టింగ్ రోల్ చేసారు.
అయితే చేసింది సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ.. తన నటనతో చిరంజీవి ప్రతి ఒక్కర్ని ఆకట్టుకున్నారు. ఆ మూవీ చేస్తున్న సమయంలోనే చిరంజీవి గురించి.. మురళి మోహన్, కృష్ణంరాజు మధ్య ఓ డిస్కషన్ కూడా జరిగింది. “వీడు ఎవడో గాని భవిషత్తులో ఇండస్ట్రీలో పెద్ద విలన్ అయ్యేలా ఉన్నాడయ్యా” అని కృష్ణంరాజు చిరంజీవి గురించి మాట్లాడితే, మురళి మోహన్ రియాక్ట్ అవుతూ.. “విలన్ ఏంటి అన్న, వాడు పెద్ద హీరో అవుతాడు చూడండి” అని చెప్పారట. ఆయన చెప్పినట్లే నేడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు.
కేవలం మురళి మోహన్, కృష్ణంరాజు మాత్రమే కాదు.. మహానటి సావిత్రి కూడా ఆ సినిమాలోని చిరంజీవి నటన చూసి భవిషత్తు చెప్పారట. ‘మన ఊరి పాండవులు’ షూటింగ్ పూర్తి అయిన తరువాత రిలీజ్ కి ముందుకు ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రీమియర్ షో వేశారు. ఆ షో చూడడానికి సావిత్రి కూడా వచ్చారు. సినిమా చూసిన తరువాత నిర్మాత జయకృష్ణని.. చిరంజీవి గురించి అడిగారట.
ఆ అబ్బాయి పేరు ఏంటండీ అని చిరంజీవి పేరు తెలుసుకున్నారట. అంతేకాదు, చిరంజీవి నటన గురించి నిర్మాతతో ఇలా అన్నారట.. “అతను ఎవరో గాని, భవిషత్తులో ఫీల్డ్ ని దున్నేస్తాడు అండి. అతడి కళ్ళే చెబుతున్నాయి” అని చెప్పారట. మహానటి చెప్పిన తరువాత అది నిజం కాకుండా ఉంటుందా. మెగాస్టార్ గా ఎదిగి గత దశాబ్దాల కాలం నుంచి తెలుగు సినిమా చక్రవర్తిగా చిరు కొనసాగుతూ వస్తున్నారు.
Also read : Kurchi MadathaPetti: కుర్చీ మడత పెట్టి సాంగ్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా అమెరికాలో?