Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్
Peddi Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం
- By Sudheer Published Date - 12:56 PM, Sat - 8 November 25
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఇంకా విడుదల కాకముందే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. దీని ద్వారా సౌత్ ఇండియన్ సినిమాల చరిత్రలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా నిలిచింది. ఈ రికార్డు అంతకుముందు పుష్ప 2 లోని ‘కిస్సిక్’ పాట పేరిట ఉంది, అది 27.19 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో నిలిచింది. అయితే ఇప్పుడు పెద్ది ‘చికిరి చికిరి’ దాన్ని అధిగమించడం, సినిమా పై భారీ అంచనాలను రేకెత్తించింది.
Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు
ఈ పాటలో రామ్ చరణ్ ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ సాంగ్‌లోని రిథమ్, రామ్ చరణ్ స్టెప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అభిమానులు #ChikiriChikiriSong, #RamCharanDance, #PeddiOnFire వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. పాటలో ఉన్న ఫోక్ వైబ్, కలర్‌ఫుల్ సెట్స్, చెర్రీ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఈ సాంగ్‌ను విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి. ఈ సాంగ్ కు రెహమాన్ ఇచ్చిన బీట్‌లు, రిథమ్ అభిమానులను ఊపేస్తున్నాయి.
ఈ సాంగ్ సక్సెస్‌తో ‘పెద్ది’పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మాస్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, చెర్రీ పాత్ర శక్తివంతంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లు మంచి హైప్ తెచ్చాయి. ఇప్పుడు ‘చికిరి చికిరి’ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్‌తో సినిమా ప్రమోషన్‌కి కొత్త ఊపు ఇచ్చింది. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసి, 2026లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.