HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Case Has Been Registered Against Vishnupriya And Others

Betting Apps Case: విష్ణుప్రియతో పాటు వీరిపై కూడా కేసు నమోదు

Betting Apps Case : ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల వేలాది మంది మోసపోయిన నేపథ్యంలో ఇకపై ఇలాంటి ప్రమోషన్‌లను నియంత్రించేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని సమాచారం

  • Author : Sudheer Date : 17-03-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vishnupriyacase
Vishnupriyacase

సామాన్య ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న బెట్టింగ్ యాప్‌(Betting Apps)లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు 11 మంది ప్రముఖ యూట్యూబర్లపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి, సుప్రీత, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్, భయ్యా సన్నీ యాదవ్, సుదీర్ రాజు, కిరణ్ గౌడ్ లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వీరు తమ వీడియోల ద్వారా వీక్షకులను బెట్టింగ్ యాప్‌ల వైపు ఆకర్షిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Revanth Reddy’s Appeal : కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానించుకున్న యూట్యూబర్లు ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం బాధాకరమని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Influence ఉన్న ప్రముఖులు తప్పుడు మార్గాలను ప్రోత్సహించడం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరు ప్రోత్సహించిన యాప్‌ల ద్వారా ఎంతో మంది యువత ఆర్థికంగా నష్టపోయారని, ఈ చర్యలు మరింత కఠినంగా ఉండాలని కోరుతున్నారు.

Uppal Stadium: హైద‌రాబాద్‌లో 9 ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్ప‌ల్ స్టేడియంలోకి ఇవి నిషేధం!

ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల వేలాది మంది మోసపోయిన నేపథ్యంలో ఇకపై ఇలాంటి ప్రమోషన్‌లను నియంత్రించేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయడంతో యువత కోటి కోట్లు పోగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోలేర్స్ మాత్రమే కాకుండా, ఈ యాప్‌లపై మరింత గట్టి నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరించే ఏ సంస్థకైనా, వ్యక్తికైనా కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Betting Apps
  • Betting Apps Case
  • tollywood
  • Vishnupriya

Related News

Netizens Troll Krithi Shetty

Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘

    Latest News

    • JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

    • CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

    • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

    • Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

    • AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd