HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Case Filed Against Manchu Mohan Babu

Manchu Mohan Babu: మోహ‌న్ బాబుకు మ‌రో బిగ్ షాక్‌.. కేసు న‌మోదు

హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

  • Author : Gopi Date : 11-12-2024 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Mohan Babu
Manchu Mohan Babu

Manchu Mohan Babu: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మంచు ఫ్యామిలీ వివాదంలో మోహ‌న్ బాబుకు (Manchu Mohan Babu) షాక్ త‌గిలింది. మంచు మోహ‌న్ బాబుకు ప‌హాడి ష‌రీఫ్ పోలీసులు షాక్ ఇచ్చారు. మీడియాపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై పహాడి షరీఫ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. హన్ బాబుపై 118 బీఎన్ఎస్‌ సెక్షన్ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి మ‌నోజ్‌తో పాటు మోహ‌న్ బాబు ఇంట్లోకి ప్ర‌వేశించిన ప‌లువురు ప్ర‌తినిధుల‌పై ఆయ‌న దాడి చేశారు. ఈ దాడిలో ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. మ‌రికొంత‌మందికి స్వ‌ల్ప గాయాలు కాగా.. కెమెరాలు, మైక్‌లు ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిలో ఒక జ‌ర్నలిస్టు చెవికి స‌ర్జ‌రీ చేయాల్సి ఉన్న‌ట్లు స‌మాచారం.

హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే ఆయనతోపాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు రావాలంటూ ఇప్పటికే మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులిచ్చారు.

Also Read: Eyelash Dandruff : కనురెప్పలపై చుండ్రు? మీరు దీని గురించి విన్నారా?

ఇప్ప‌టికే మోహ‌న్ బాబు.. మ‌నోజ్‌కు సంబంధించి ఓ ఆడియో నోట్‌ను కూడా విడుద‌ల చేశారు. అందులో నువ్వు నాకు ఇష్ట‌మైన కొడుకువిరా. నీ భార్య మాట‌లు విని నువ్వు ఇలా అయిపోయావు. తాగుడుకు బానిస అయ్యావు. అంద‌రికంటే ప్రేమ‌గా నిన్నే చూసుకున్నాను. నువ్వు చేస్తున్న ఈ అల్ల‌రి చూసి మీ అమ్మ ఆస్ప‌త్రి పాలైంది. ఇప్ప‌టికే రెండు సార్లు మార‌తాన‌ని ప్రామిస్ చేశావు. కానీ నీ ప‌ద్ద‌తితో ఎలాంటి మార్పు రావ‌టంలేదు. ప్ర‌తి ఫ్యామిలీలో ఉండే గొడ‌వ‌లే ఇవి. వీటిని జ‌ర్న‌లిస్టు సోద‌రులు పెద్ద‌ది చేయ‌కండి అని ఆయ‌న ఆడియో నోట్‌లో తెలిపారు.

మ‌నోజ్‌ను గ‌న్‌తో బెదిరించిన మోహ‌న్ బాబు

గ‌త రాత్రి జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద హైడ్రామా కొన‌సాగింది. ఈ హైడ్రామాలో మ‌నోజ్ త‌న తండ్రి ఇంటి గేట్ల‌ను తోసుకుంటూ లోప‌ల‌కి వెళ్లారు. ఈ స‌మ‌యంలోనే మోహ‌న్ బాబు, మ‌నోజ్ మ‌ధ్య మ‌రోసారి ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. మ‌నోజ్‌పై దాడి చేయ‌డ‌మే కాకుండా గ‌న్‌తో కూడా మోహ‌న్ బాబు బెదిరించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రీ ఈ మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Case On Mohan Babu
  • Manchu Family Dispute
  • Manoj
  • mohan babu
  • telangana police
  • tollywood
  • vishnu

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd