Mangli Birthday Party: మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం.. సినీ ప్రముఖులు అరెస్ట్?
ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధిత సమస్యలపై మరోసారి చర్చను రేకెత్తించింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కొందరు సినీ ప్రముఖులపై వచ్చాయి.
- By Gopichand Published Date - 12:06 PM, Wed - 11 June 25

Mangli Birthday Party: ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ బర్త్‌డే పార్టీ (Mangli Birthday Party) చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో జరిగింది. ఈ వేడుకల్లో గంజాయి వాడకం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసి, పార్టీలో పాల్గొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి, విదేశీ మద్యం వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిపై డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, కొందరికి గంజాయి వాడినట్లు పాజిటివ్‌గా తేలిందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి
హైదరాబాద్ సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభ్యమైంది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్నేహితులకు పార్టీ ఇచ్చారు. చేవెళ్ల శివారు ఈర్లపల్లి వద్ద రిసార్టులో మంగళవారం రాత్రి ఈ వేడుక జరిగింది. దీంతో ఈ రిసార్ట్టుపై… pic.twitter.com/LkYJjAsqUu
— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2025
మంగ్లీ తన బర్త్‌డే సెలబ్రేషన్ కోసం సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు స్నేహితులతో కలిసి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో గంజాయి వాడకం జరిగిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఘటన సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రిసార్ట్‌లో సోదాలు చేసినప్పుడు గంజాయి, ఇతర నిషిద్ధ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Also Read: Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనపై మంగ్లీ లేదా ఆమె బృందం నుండి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ఈ విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొంటుండగా, మరికొందరు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సరఫరా మూలాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధిత సమస్యలపై మరోసారి చర్చను రేకెత్తించింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కొందరు సినీ ప్రముఖులపై వచ్చాయి. కానీ ఈ సంఘటన మంగ్లీ లాంటి ప్రముఖ గాయని పేరుతో ముడిపడటంతో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గంజాయి సేవించిన వారిలో మంగ్లీ ఉన్నారా? లేదా అనేది కూడా తెలియాల్స ఉంది.