Sreeleela With Charan: జాక్ పాట్ కొట్టిన శ్రీలీల, రామ్ చరణ్ తో యంగ్ బ్యూటీ రొమాన్స్?
రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే అది ఖచ్చితంగా శ్రీలీలకు జాక్ పాట్ అవుతుంది.
- Author : Balu J
Date : 29-07-2023 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఉప్పెన’ సినిమాతో అరంగేట్రం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. శంకర్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ తర్వాత రామ్ చరణ్ తో చిత్రం ప్రారంభం కానుంది. ఈ సినిమా కథ, చరణ్ పాత్ర గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. AR రెహమాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడటంతో, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు దాదాపుగా ఖరారైంది.
ఇక మిగిలింది హీరోయిన్ ఎంపిక మాత్రమే. అది ఎవరనే విషయంపై బుచ్చిబాబు తాజాగా హింట్ ఇచ్చారు. తన తదుపరి సినిమా విషయంలో రాజీపడబోనని, ఓ కార్యక్రమానికి హాజరైన శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపించాడు. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తదుపరి చిత్రంలో శ్రీలీలనే హీరోయిన్ అని నిర్ధారణకు వస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ నటి శ్రీలీల అనే విషయం తెలిసిందే. ఆమె మహేష్ ‘గుంటూరు కారం’, పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ ‘స్కంద’, వైష్ణవ్ ‘ఆదికేశవ’, విజయ్ దేవరకొండ చిత్రం, బాలయ్య ‘భగవంత్ కేసరి’, నితిన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాల్లో నటిస్తోంది.
రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే అది ఖచ్చితంగా శ్రీలీలకు జాక్ పాట్ అవుతుంది. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది కాబట్టి, నటి తన ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేయడానికి చాలా సమయం ఉంటుంది. మరి ఈ క్రేజీ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో శ్రీలీల నిజంగా హీరోయిన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Also Read: Harish Rao: బీజేపీ శాపం, కాంగ్రెస్ పాపం తెలంగాణకు అవసరమా: హరీశ్ రావు