Pushpa 2 Stopped: సుకుమార్ షాకింగ్ డెసిషన్.. పుష్ప-2 షూటింగ్ నిలిపివేత!
ప్రస్తుతం పుష్ప 2 టాలీవుడ్ మోస్ట్ ఎవైటేడ్ మూవీగా మారింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Balu J Published Date - 11:49 AM, Sat - 1 April 23
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఈ మూవీ 17 డిసెంబర్ 2021న విడుదలై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకుంది. మొదటి పార్ట్ ఊహించనిదాని కంటే సూపర్ హిట్ కావడంతో మేకర్స్ పార్ట్ -2 ద్రుష్టి పెట్టారు. ప్రస్తుతం పుష్ప 2 టాలీవుడ్ మోస్ట్ ఎవైటేడ్ మూవీగా మారింది. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అభిమానులు ఫుల్ అప్ సెట్ అయ్యారు. ఇదిలా పుష్ప 2 షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఈ చిత్రంలోని ఓ షెడ్యూల్ ను వైజాగ్‌లో షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి షూటింగ్ జరగలేదు. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 టీజర్‌పై ఫోకస్ పెట్టాడని, అల్లు అర్జున్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు చిత్రీకరించిన కంటెంట్‌పై సుకుమార్ సంతృప్తి చెందలేదని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్టు సమాచారం.
దర్శకుడు ఇప్పటివరకు షూట్ చేసిన సీన్స్ ను మరోసారి రీషూట్ చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు మూడు నెలల తర్వాత మొదలవుతుందని, అప్పటి వరకు సినిమాలోని ప్రధాన తారలు ఇతర సినిమాల ప్రాజెక్ట్‌లను ఎంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సినిమాలో ప్రధాన నటి రష్మిక మందన్న కూడా ప్రస్తుతం తను సైన్ చేసిన మరో రెండు చిత్రాలపై దృష్టి పెట్టింది.
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�