Bunny Vasu : ఆ ముగ్గురితో సినిమా చేయడమే నా డ్రీమ్ అంటున్న బన్నీ వాసు..!
Bunny Vasu సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో బన్నీ వాసు తన డ్రీం హీరోల గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రన్ బీర్ ఈ ముగ్గురితో సినిమా చేయాలి అన్నది తన డ్రీం
- By Ramesh Published Date - 11:46 PM, Wed - 5 February 25

Bunny Vasu : గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్లు అరవింద్ సమక్షంలో ఆయన గైడెన్స్ ప్రకారం లోనే బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తుంటాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేసిన బన్నీ వాసు సినిమా మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబో సో అది కూడా తండేల్ కి కలిసి వచ్చింది.
ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో బన్నీ వాసు తన డ్రీం హీరోల గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రన్ బీర్ ఈ ముగ్గురితో సినిమా చేయాలి అన్నది తన డ్రీం అని చెప్పారు బన్నీ వాసు. ఐతే బన్నీ వాసు చెప్పాడు సరే వాళ్లు ఆయనతో సినిమా చేయాలిగా అంటున్నారు ఆడియన్స్.
ఇక ఎన్నాళ్లు గీతా ఆర్ట్స్ లో ఉంటారు. బన్నీ వాసు సొంత కుంపటి పెట్టుకోరా అన్న ప్రశ్నకు సమాధానంగా అల్లు అరవింద్ గారి దగ్గరే ఉంటానని బయటకు వచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఐతే కొన్ని సినిమా కథలు తనకు బాగా నచ్చితే మాత్రం అల్లు అరవింద్ గారితో మాట్లడి ఎలాగోలా సెట్ చేస్తానని అన్నారు బన్నీ వాసు.
చిన్నగా గీతా ఆర్ట్స్ 2 నుంచి కూడా భారీ సినిమాలు చేయాలని చూస్తున్నాడు బన్నీ వాసు. తండేల్ తో ఆ కేటగిరిలో తొలి అటెంప్ట్ చేశాడు బన్నీ వాసు.