Natu Natu: బ్రహ్మాజీ ‘నాటు నాటు’ డ్యాన్స్ చూస్తే పడీపడీ నవ్వుకుంటారు!
తెలుగు జనాలనే కాదు, ప్రపంచంలోని చాలామందిని ఊపేసిన పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట.
- By Nakshatra Published Date - 10:09 PM, Mon - 6 February 23
Natu Natu: తెలుగు జనాలనే కాదు, ప్రపంచంలోని చాలామందిని ఊపేసిన పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి వెండి తెర మీద తమ స్టెప్పులతో చేసిన అద్భుతం గురించి ఎంత అద్భుతం చేశారో అందరం చూశాం. పూర్తి గ్రేస్ తో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ వేసిన స్టెప్పులు థియేటర్లో జనాలను ఊపేయడం తెలిసిందే.
ఈ పాటకు తాజాగా నటుడు బ్రహ్మాజీ వేసిన స్టెప్పులు అందరినీ నవ్విస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ‘అమిగోస్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న యాంకర్ సుమ.. నటుడు బ్రహ్మాజీని బాగా ఆటపట్టించింది. బ్రహ్మాజీ ఎన్టీఆర్ చేసిన ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి చూపిస్తాడని చెప్పింది.
దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నాటు నాటు’ పాట వేయగా.. నటుడు బ్రహ్మాజీ ఆ పాటకు స్టెప్పులు వేశాడు. అయితే బ్రహ్మాజీ స్టెప్పులు వేసిన స్టెప్పులు అందరినీ నవ్వించాయి. బ్రహ్మాజీ కూర్చున్న దగ్గర స్టెప్పులు వేయడంతో పాటు డ్యాన్స్ చేయడానికి పడిన పాట్లు అక్కడ ఉన్న ఎన్టీఆర్ తో పాటు అందరినీ నవ్వుతెప్పించింది.
Related News
Sai Durga Tej : కొత్త దర్శకుడితో మెగా మేనల్లుడు.. ఆ సినిమా పరిస్థితి ఏంటో..?
Sai Durga Tej విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా సినిమా అన్ని వర్గాల