Disco Dancer: భారతదేశంలో తొలి 100 కోట్ల సినిమా ఏంటి?
కెరీర్‌లో 100 కోట్ల సినిమా అనేది ప్రస్తుతం హీరోలకు సాధారణ విషయం. టికెట్ ధరలు పెంచుకొనే వెసులుబాటు ప్రస్తుతం కనిపిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 08:13 PM, Wed - 21 June 23

Disco Dancer: కెరీర్‌లో 100 కోట్ల సినిమా అనేది ప్రస్తుతం హీరోలకు సాధారణ విషయం. టికెట్ ధరలు పెంచుకొనే వెసులుబాటు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక అధిక థియేటర్లలో విడుదల చేయడంతో సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం పెద్ద విషయం కాదు. కానీ 40 ఏళ్ళ క్రితం ఓ సినిమా 100 కోట్లు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అయితే బాలీవుడ్‌లో రూ.100 కోట్లు సాధించిన తొలి సినిమా 40 ఏళ్ళ క్రితమే వచ్చింది. సినిమా చరిత్రలో ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా డిస్కో డాన్సర్. ఇందులో డిస్కో స్టార్‌గా మారిన వీధి గాయకుడు జిమ్మీగా మిథున్ చక్రవర్తి నటించారు. 1982లో వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 1984లో సోవియట్ రష్యాలో విడుదలైనప్పుడు దేశంలోనే అతిపెద్ద హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 12 కోట్ల టిక్కెట్‌లను విక్రయించి సుమారు 60 మిలియన్ రూబిళ్లు (దాదాపు రూ. 94.28 కోట్లు) సంపాదించింది. దీంతో డిస్కో డాన్సర్ ప్రపంచవ్యాప్తంగా రూ.100.68 కోట్లకు చేరుకుంది.
Read More: Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు