Shah Rukh Khan: కొడుకు కోసం చొక్కా విప్పేసిన బాలీవుడ్ హీరో.. ఎందుకో తెలుసా?
- By Sailaja Reddy Published Date - 09:00 AM, Mon - 26 February 24
తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు షారుఖ్. నాలుగేళ్ళ తర్వాత వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్. పఠాన్, జవాన్, డంకి సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తానే బాద్షా అని మరో సారి నిరూపించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. డంకి సినిమా పర్లేదు అనిపించుకున్నపటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఈ మూడు సినిమాలు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన సృష్టించాయి.
సినిమాలతో పాటు షారుఖ్ అనేక బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. అలాగే చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు షారుక్ ఖాన్. వీటన్నింటికీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా కొడుకు కోసం షారుఖ్ చొక్కా విప్పేసి మరి ఫోటోలకు ఫోజులిచ్చాడు. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఆర్యన్ పేరు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా అన్ని ఇండస్ట్రీలలో ఆర్యన్ పేరు మారు మోగిపోయింది.
ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ కాస్త డల్ అయ్యాడు. ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యాడు. సొంతంగా దుస్తుల బ్రాండ్ ప్రారంభించిన ఆర్యన్ ఖాన్ దాని ప్రమోషన్ కోసం తన తండ్రిని ఉపయోగించుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో, అతను చొక్కా లేకుండా కనిపించాడు. ఈ ఫొటోకు తన కొడుకు దుస్తుల బ్రాండ్‌ను ట్యాగ్ చేశాడు షారుఖ్. ఈ ఫోటోకు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. తన తండ్రి సపోర్ట్ చూసి ఆర్యన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్ చాలా ఖరీదైనది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News
Aamir Khan : ‘పఠాన్’ సినిమాలో మా అక్క నటించింది మీకు తెలుసా.. ఆమిర్ ఖాన్
'పఠాన్' సినిమాలో మా అక్క నటించింది మీకు తెలుసా అంటున్న ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్ కి తాయత్తు కట్టి..