Salaar : ప్రభాస్ ఫై విషం చిమ్ముతున్న బాలీవుడ్
- By Sudheer Published Date - 10:02 PM, Sat - 23 December 23
బాలీవుడ్ మరోసారి పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas) ఫై విషం చిమ్మడం మొదలుపెట్టింది. బాహుబలి సినిమా తో టాలీవుడ్ (Bollywood) సత్తా ఏంటో చూపించిన హీరో ప్రభాస్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు..ఆ ఇండస్ట్రీ..ఈ ఇండస్ట్రీ అనే కాదు..ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఈ సినిమా కలెక్షన్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ సైతం టాలీవుడ్ లో పెద్దగా ఆడకపోయినా..బాలీవుడ్ లో వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ సైతం పర్వాలేదు అనిపించాయి.
We’re now on WhatsApp. Click to Join.
బాహుబలి (Baahubali) తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ స్థాయి కి చేరుకోవడమే కాదు ఆస్కార్ అవార్డ్స్ ను , నేషనల్ అవార్డ్స్ ను సైతం దక్కించుకునే స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ నుండి పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు..బాలీవుడ్ కింగ్ ఖాన్ సినిమాలను సైతం పక్కన పెట్టి టాలీవుడ్ సినిమా కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగింది. తాజాగా సలార్ (Salaar) మూవీ విషయంలోనూ అదే జరుగుతుంది. షారుఖ్ నటించిన సినిమాను పక్కన పెట్టి ప్రభాస్ నటించిన సలార్ ను చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇదే బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది. సోషల్ మీడియా ను వేదికగా చేసుకొని సలార్ మూవీ ప్లాప్ అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ ను కించపరుస్తూ పోస్టులు పెడుతూ..సలార్ మూవీ ప్లాప్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారు. దీనిపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది. 2023లో విడుదలయిన అన్ని సినిమాల్లో మొదటిరోజే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా ‘యానిమల్’, ‘జవాన్’, ‘పఠాన్’ నిలిచాయి. ఇప్పుడు ఏకంగా ఆ మూడు సినిమాను దాటి ‘సలార్’ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ను సాధించి రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే ‘సలార్’ పాజిటిక్ టాక్తో దూసుకుపోతుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు బ్రేక్ చేస్తున్నందుకు వారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Read Also : Game Changer : హమ్మయ్య.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు..
Related News
Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?
ప్రభాస్ 'సలార్ 2'లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? ఏ పాత్ర కోసం..?