HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Has Lost Its Soul Prakash Rajs Shocking Comments

బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయింది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 26-01-2026 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prakash Raj 
Prakash Raj 

Prakash Raj  దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విభిన్నమైన పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై (బాలీవుడ్) ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.

  • బాలీవుడ్ సినిమాలను ప్లాస్టిక్ విగ్రహాలతో పోల్చిన వైనం
  • బాలీవుడ్  మూలాలను కోల్పోయిందన్న ప్రకాశ్ రాజ్
  • హిందీ సినిమాల్లో కథ, భావోద్వేగాలు లేవని విమర్శ

కేరళలోని కోజికోడ్‌లో నిర్వహించిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్… బాలీవుడ్ ప్రస్తుతం తన అసలైన మూలాలను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైకి చూడటానికి హిందీ సినిమాలు చాలా రంగులమయంగా, భారీ సెట్లు, గ్లామర్‌తో కనిపిస్తున్నాయని, కానీ లోపల మాత్రం వాటికి ఆత్మ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్ సినిమాలను ఆయన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాలతో పోల్చడం విశేషం. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో జీవం ఉండదని చెప్పారు. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమా పరిశ్రమ కథలు, భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం లగ్జరీ లుక్స్, భారీ బడ్జెట్లు, మార్కెటింగ్, డబ్బు చుట్టూనే తిరుగుతోందని ఆయన విమర్శించారు.

అదే సమయంలో దక్షిణాది సినిమా పరిశ్రమను ప్రకాశ్ రాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు మట్టి వాసన కలిగిన కథలను, సామాన్యుల జీవితాలను, అట్టడుగు వర్గాల సమస్యలను ఎంతో సహజంగా తెరపై చూపిస్తున్నాయని కొనియాడారు. దళితుల వేదన, సామాజిక అసమానతలు వంటి అంశాలను నిజాయతీగా చెప్పే ప్రయత్నం అక్కడి దర్శకులు చేస్తున్నారని చెప్పారు.

‘మన వేర్లు మన కథల్లో ఉండాలి. ప్రాంతీయతను వదిలేసి కేవలం గ్లామర్ వెంటే పరిగెత్తితే ప్రేక్షకులు దూరమవుతారు’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో వచ్చిన ‘జై భీమ్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే, బాలీవుడ్ మాత్రం ఇంకా కమర్షియల్ హంగులకే పరిమితమైందని ఆయన అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • indian cinema
  • jai bhim
  • Kerala Literature Festival
  • Malayalam Cinema
  • Mamannan
  • prakash raj
  • South Indian Cinema
  • Tamil cinema

Related News

Dhanush

హీరో ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!

Dhanush రూ.20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సినీ నటుడు ధనుష్‌కు తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. చాలాకాలంగా వాయిదాపడుతున్న ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నోటీసులు పంపించింది. ఆయన కమిట్‌మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల తమ సినిమా ఆలస్యమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగ

    Latest News

    • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

    • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

    • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

    • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

    • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

    Trending News

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd