Deepika Padukone: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె
తిరుమల తిరుపతి అంటే టాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే కాదు.. బాలీవుడ్ నటీనటులకు కూడా సెంటిమెంట్.
- Author : Balu J
Date : 15-12-2023 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
Deepika Padukone: తిరుమల తిరుపతి అంటే టాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే కాదు.. బాలీవుడ్ నటీనటులకు కూడా సెంటిమెంట్. అందుకే క్రమం తప్పకుండా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తాజాగా తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్’ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె తన సోదరి అనీషాతో కలిసి శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చారు.
కాలినడకన తిరుమలకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే.youtube.com/@HashtagU/featured… #DeepikaPadukone #tirupatibalajitemple #Tirumala #TTD #Tirupati #HashtagU @TTDevasthanams @deepikapadukone pic.twitter.com/JAsfMtmfFe
— Hashtag U (@HashtaguIn) December 15, 2023
దీపికా తన సోదరి అనీషాతో కలిసి తిరుమలకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో అనేక వీడియోలు, చిత్రాలు వెలువడ్డాయి. శుక్రవారం ఉదయం దీపిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి దర్శనం చేసుకుంది. బాలీవుడ్ నటిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఆమె నటించిన ‘ఫైటర్’ సినిమాపై అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ, ‘షేర్ ఖుల్ గయే’ చిత్రంలోని మొదటి పాటను ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొణె.https://t.co/RjuDtizjZw #DeepikaPadukone #tirupatibalajitemple #Tirumala #TTD #Tirupati #HashtagU @TTDevasthanams @deepikapadukone pic.twitter.com/XR1VtTzL1L
— Hashtag U (@HashtaguIn) December 15, 2023
Also Read: Guntur Kaaram: గుంటూరు కారం పాటపై ట్రోల్స్.. రామజోగయ్య శాస్త్రి రియాక్షన్