Kareena Kapoor:కరోనా సోకిన కరీనాపై అధికారులు సీరియస్
కరోనా సోకిన కరీనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు.
- By Siddartha Kallepelly Published Date - 09:26 AM, Wed - 15 December 21

కరోనా సోకిన కరీనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు.
కరణ్ జోహార్ ఇంట్లో డిన్నర్‌కు వెళ్లిన కరీనా,అమృతా అరోరాలకు కరోనా సోకింది. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ముంబైలోని పలు పార్టీల్లో పాల్గొన్నట్టు దాంతో మరింతమందికి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే తన భర్త సైఫ్ అలీఖాన్ గురించి సమాచారం అడిగితే కరీనా చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే సమాధానమే చెప్తోందని దీనివల్ల ట్రేసింగ్ కష్టమవుతోందని అధికారులు అసహనం వ్యక్తం చేసారు.

Outside Kareena Kapoor House
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ముంబై కార్పొరేషన్ అధికారులు కరీనా నివసించే భవనాన్ని సీల్ చేసి చుట్టుపక్కల వారికి పరీక్షలు నిర్వహించారు. కానీ కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కరీనాతో సహా తన కుటుంబ సభ్యులు సహకరించడం లేదని తెలిపారు.
కరీనా నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై తన వ్యక్తిగత సిబ్బంది రియాక్టయ్యారు. కరీనా రెస్పాన్సిబుల్ పర్సన్ అని, తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే క్వారంటైన్‌కు వెళ్లారని ముంబై కార్పొరేషన్ అధికారులు అనవసరంగా కరీనాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Bollywood actress Kareena Kapoor's residence being sanitized by @mybmc after actress tested covid positive. pic.twitter.com/YOVH6QSh9I
— Afroz Alam (@AfrozJournalist) December 14, 2021