BiggBoss : వేణు స్వామికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ టీం..!
బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్ కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఒకప్పటి హీరో రోహిత్ కూడా ఈసారి ఒక కంటెస్టెంట్ గా
- By Ramesh Published Date - 10:34 AM, Fri - 23 August 24

సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం బుల్లితెర ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ సీజన్ ని సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. హోస్ట్ గా నాగార్జునతో ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోస్ బిగ్ బాస్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్ కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఒకప్పటి హీరో రోహిత్ కూడా ఈసారి ఒక కంటెస్టెంట్ గా వస్తారని తెలుస్తుంది.
ఐతే వీరితో పాటు వేణు స్వామి కూడా బిగ్ బాస్ (BiggBoss) కి వస్తారన్న టాక్ వినిపించింది. బిగ్ బాస్ కి కావాల్సింది కూడా కాంట్రవసీ మనుషులే. ముందు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినా వేణు స్వామి కాదనేశారట. హౌస్ లో వారానికి కొంత రెమ్యునరేషన్ లా ఇచ్చి ఆయన్ను ఉంచాలని అనుకోగా బయట ఉంటే దానికి డబుల్ సంపాదించుకోవచ్చని వేణు స్వామి బిగ్ బాస్ ఆఫర్ కాదన్నారట.
Also Read : Kiran Abbavaram : ఒక్కటైన ప్రేమ జంట..!
ఈమధ్య వేణు స్వామి మీద ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇంకా ఫిల్మ్ జర్నలిస్టులు అంతా కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తే వేణు స్వామి రిస్క్ లో పడేలా ఉన్నాడు. ఈ టైం లో తాను బిగ్ బాస్ కి వెళ్తే బాగుంటుందని అనుకున్నాడు వేణు స్వామి. ఈ క్రమంలో బిగ్ బాస్ టీం ని సంప్రదిస్తే.. వాళ్లొచ్చినప్పుడు కాదని చెప్పడంతో ఇప్పుడు వేణు స్వామికి బిగ్ బాస్ టీం కూడా షాక్ ఇచ్చిందట.
అదీగాక హోస్ట్ నాగార్జున హౌస్ లో వేణు స్వామి (Venu Swami ) ఉంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నుంచి వేణు స్వామి అందరికీ టార్గెట్ అయ్యాడు. ఐతే ముందు బిగ్ బాస్ వాళ్లు సంప్రదిస్తే కాదన్న అతను ఇప్పుడు వెళ్లాలనుకున్నా బిగ్ బాస్ టీం నో చెప్పేస్తున్నారట.