BiggBoss 8 First Elimination : బిగ్ బాస్ 8.. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు..?
ఈ వారం నామినేషన్స్ లో సోనియా, విష్ణు ప్రియ, బేబక్క, నాగ మణికంఠ, పృధ్విరాజ్, శేఖర్ బాషా ఉన్నారు. ఐతే శనివారం ఎపిసోడ్ లో సోనియా సేవ్
- Author : Ramesh
Date : 08-09-2024 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
BiggBoss 8 First Elimination బిగ్ బాస్ సీజన్ 8 వారం రోజులు పూర్తి చేసుకుని. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మొదటి వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో సోనియా, విష్ణు ప్రియ, బేబక్క, నాగ మణికంఠ, పృధ్విరాజ్, శేఖర్ బాషా ఉన్నారు. ఐతే శనివారం ఎపిసోడ్ లో సోనియా సేవ్ అయ్యింది . ఇంకా ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో అందులో ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ (BiggBoss Elimination) అవుతారన్నది తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 (BiggBoss8) లో మొదటి ఎలిమినేటర్ గా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ ముందే షూట్ చేస్తారు. బిగ్ బాస్ లీక్స్ ప్రకారం నేడు హౌస్ నుంచి బేబక్క ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐతే వారం లోనే ఆమె హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది.
కిచెన్ డిపార్ట్ మెంట్ లో ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్..
బేబక్క (Bebakka) నామినేషన్స్ లో ఉన్నా మిగ్తా వారం రోజులు ఆమె టాస్కుల్లో ఎక్కువగా కనిపించలేదు. అంతేకాదు కిచెన్ డిపార్ట్ మెంట్ లో ఆమె కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ అంటే హౌస్ మెట్స్ ఏమైనా చేసుకోవాలని అనుకున్నా వద్దు కాదు కుదరదని చెబుతుంది. అందుకే బయట ఉన్న ఆడియన్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఫస్ట్ ఎలిమినేటర్ గా బేబక్క బయటకు వస్తుంది. ఐతే మొదటి వారం నామినేషన్స్ తోనే ఒక రేంజ్ లో జరగగా సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.
Also Read : Rajamouli Nitin : రాజమౌళి సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ ఫిక్స్..!