Vishnu Priya : మైక్ ఉంది కదా అని రెచ్చిపోతే ఇలానే అవుతుంది..!
కోట్లు ఇచ్చినా సరే తాను మాత్రం బిగ్ బాస్ కు వెళ్లనని చెప్పింది విష్ణు ప్రియ. ఇప్పుడు సీజన్ 8 లో ఆమె కంటెస్టెంట్ గా వచ్చింది.
- By Ramesh Published Date - 05:04 AM, Tue - 3 September 24

మౌత్ ముందు మైక్ పెడితే కొందరు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. ఏదో ఒకటి మాట్లాడేద్దాం అనుకునే వారు ఉంటారు. ఐతే ఒకసారి వారు అన్న మాటలను వారే దాటేస్తూ కొన్ని పనులు చేస్తారు ఆ టైం లో పాత వీడియోలు తీసి వాళ్లను ఆడుకుంటారు నెటిజన్లు. ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎవరిని వదిలిపెట్టరు. ఇంతకీ విషయం ఏంటంటే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది.
ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఉంది. ఐతే బిగ్ బాస్ 8 స్టేజ్ మీద ఇక్కడకు వచ్చేందుకు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని. రెండు సీజన్లుగా ఎదుచూస్తున్నానని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఐతే ఇప్పుడు ఇలా అన్న అమ్మడు అంతకుముంది బిగ్ బాస్ అంటే అసలు తనకు ఇష్టం లేదని. మన ఇంట్లో మనం ఉండాలి ఆ హౌస్ కి వెళ్లాల్సిన పని ఏముంది అంటూ మాట్లాడింది. కోట్లు ఇచ్చినా సరే తాను మాత్రం బిగ్ బాస్ కు వెళ్లనని చెప్పింది విష్ణు ప్రియ. ఇప్పుడు సీజన్ 8 లో ఆమె కంటెస్టెంట్ గా వచ్చింది. ఈ వీడియో తో విష్ణు ప్రియని ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.
బిగ్ బాస్ 8 ( Bigg Boss 8) స్టేజ్ మీద ఇలా మాట్లాడిన విష్ణు ప్రియ (Vishnu Priya) ఒకప్పుడు బిగ్ బాస్ పై అలాంటి కామెంట్స్ చేసిందని వీడియో (Video)ని వైరల్ చేస్తున్నారు. ఐతే మనం మనుషులం కదా ఒక దాని మీద ఒకసారి ఉన్న అభిప్రాయం మరోసారి మారొచ్చు. ఏది ఏమైనా బిగ్ బాస్ అంటే అసలేమాత్రం ఇంట్రెస్ట్ లేదన్నట్టు మాట్లాడిన విష్ణు ప్రియ షోలో ఎంట్రీ కోసం రెండు సీజన్లుగా ఎదురుచూస్తున్నా అని చెప్పడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది.
ఈ సీజన్ (Season) లో హౌజ్ లోకి వెళ్లిన ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న వారిలో విష్ణు ప్రియ ఒకరు. మరి అమ్మడు బుల్లితెర మీద ఉన్న ఇమేజ్ ఆమెను ఎంతవరకు షోలో కొనసాగిస్తుంది అన్నది చూడాలి.
Also Read : Trisha : త్రిషని రికమెండ్ చేసిన అజిత్.. వరుసగా రెండు సినిమాలు..!