HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Fame Keerthi Bhat Lost 2 Lakh In Cyber Fraud

Keerthi Bhat: లక్షలు పోగొట్టుకొని దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమై

  • Author : Anshu Date : 31-03-2024 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keerthi Bhat
Keerthi Bhat

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న మధురానగరీలో అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది కీర్తి భట్. ఈమె బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మధ్య బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. మొన్నీమధ్య కుమారి ఆంటీ ఫుడ్ పై వీడియో చేసి వైరల్ అయ్యింది కీర్తి భట్.

కుమారి ఆంటీ ఫుడ్ గురించి కీర్తి భట్ వీడియో చేసింది. కర్రీస్ లో కారం ఎక్కువ ఉందని కీర్తి భట్, ఆమె భర్త వీడియో చేశారు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కీర్తిని, ఆమె భర్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో కీర్తి భట్, ఆమె భర్త క్లారిటీ ఇచ్చారు కూడా, ఇక ఇప్పుడు మరోసారి కూడా వార్తల్లో నిలిచింది కీర్తిభట్. ఇప్పుడు ఈ చిన్నది సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఒక్క క్లిక్ తో రెండు లక్షలు పోగొట్టుకుందట కీర్తి భట్. తాజాగా కీర్తిభట్ తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని తెలిపింది. కొరియర్‌ కోసం ఒక లింక్‌ క్లిక్‌ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుందట.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను షేర్ చేసింది కీర్తి. ఈ వీడియోలో తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఒక కొరియర్ రావాలి. అయితే వారం రోజులు దాటి పోయినా కూడా అది రాలేదు. దాంతో నాకు ఒక ఫోన్ వచ్చింది. నా కొరియర్ మెహదీ పట్నంలో ఉంది. దాని అడ్రస్ అప్డేట్ కాలేదు అడ్రస్ మేసేజ్ చేయండి అని అన్నారు. దాంతో నేను ఒక వాట్సాప్ నెంబర్ కు అడ్రస్ పంపించాను. ఆ తర్వాత నార్మల్ మెసేజ్ చేయమన్నారు. అయితే రెండు రూపాయిలు ఎక్స్ ట్రా కట్టాలి ఒక లింక్ పంపిస్తున్నాం అని చెప్పారు. సరే అని వాళ్లు చెప్పినట్టు ఆ లింక్ క్లిక్ చేస్తే రెండు రూపాయలు కట్ అయ్యాయి. సరేలే అనుకోని నేను షూటింగ్ కు వెళ్ళాను. సరిగ్గా అర్ధరాత్రి 12 సమయంలో 99 వేలు కట్ అయ్యాయి. ఆ తర్వాత మరో 99 వేలు కట్ అయ్యాయి. దాంతో ఏం చెయ్యాలో అర్ధం కాక పోలీసులను ఆశ్రయించాను. ఆ అకౌంట్స్ ను ట్రాక్ చేసి బ్లాక్ చేశాం అని పోలీసులు తెలిపారు. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు అని తెలిపింది కీర్తి భట్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss
  • cyber fraud
  • Keerthi Bhat
  • tollywood

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd