Bigg Boss 8 : బిగ్ బాస్ కోసం కింగ్ సైజ్ రెమ్యునరేషన్..!
నాగార్జున భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. సీజన్ సీజన్ కి తన రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నాడు నాగార్జున.
- By Ramesh Published Date - 11:45 PM, Wed - 24 July 24

Bigg Boss 8 బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో మొదలు కాబోతుంది. బిగ్ బాస్ టీం ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈసారి సీజన్ కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా మరోసారి కింగ్ నాగార్జున వ్యవహరించనున్నారు. లాస్ట్ సీజన్ వరకు హోస్ట్ గా వేరే వాళ్ల గురించి వార్తలు వచ్చాయి కానీ తెలుగు బిగ్ బాస్ అంటే నాగార్జున అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 (BiggBoss Telugu Season 8) కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. సీజన్ సీజన్ కి తన రెమ్యునరేషన్ ని పెంచేస్తున్నాడు నాగార్జున. ఈ సీజన్ కోసం ఏకంగా 10 కోట్లు పెంచినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున అక్షరాల 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ రూపం లో అందుకుంటున్నారని టాక్.
Also Read : Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ తేడా కొడుతున్న బిజినెస్ లెక్కలు..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ కు ఎంతమంది క్రేజీ కంటెస్టెంట్స్ వచ్చినా వీకెండ్ వచ్చే నాగార్జున ఎపిసోడ్ మాత్రం రేటింగ్ లో అదిరిపోతుంది. నాగార్జున కూడా మొదటి రెండు సీజన్లు కాస్త కంగారు పడ్డా ఇప్పుడు రేసు గుర్రంలా దూసుకెళ్లిపోతున్నాడు. అందుకే నాగ్ అడిగిన రెమ్యునరేషన్ (Nagarjuna Remuneration) ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఏమాత్రం వెనకాడదు.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో సోషల్ మీడియా సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్స్ కొన్ని బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి చెబుతున్నారు. ఐతే షో మొదలయ్యే వరకు ఎంతోమంది పేర్లు చెబుతూనే ఉంటారని తెలిసిందే.
Also Read : Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?