Allu Arjun Sankranti Treat: పుష్ప ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ‘బన్నీ’ స్పెషల్ సర్ ప్రైజ్!
Pushpa2 ఫస్ట్‌లుక్‌ని సంక్రాంతి సందర్భంగా రివీల్ చేయనున్నట్టు సమాచారం.
- By Balu J Published Date - 12:37 PM, Sat - 7 January 23

సరైన కథనం (Story).. దానికి తగ్గ స్క్రీన్ ప్లే.. అద్భుత నటన తోడైతే చాలు.. ఎలాంటి సినిమా సరే అయినా ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది. పుష్ప (Pushpa) సినిమా కూడా అంతే.. విడుదలై ఏడాది కావోస్తునా.. నేటికీ ఆ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది.
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న దాని సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ (Pushpa2) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. బన్నీ కూడా ఎక్కడా మాట్లాడలేదు. పుష్ప2 అప్డేట్ కోసం అభిమానులు, ముఖ్యంగా అల్లు అర్మీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. డిసెంబర్ లోనే ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేడ్ ఉంటుందని భావించినా ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా బన్నీ త్వరలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని సంక్రాంతి సందర్భంగా రివీల్ చేయనున్నట్టు సమాచారం. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇది నిజమని తేలితే, సంక్రాంతికి పుష్పరాజ్ (Pushpa Fans) అభిమానులందరికీ ఇది సరైన ట్రీట్ అవుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun) పక్కన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల రష్యాలో విడుదలైన పుష్ప సినిమా రికార్డులు తిరుగరాస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Union Minister Post: బీజేపీ బిగ్ స్కెచ్.. తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!