HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Shock To Ramgopal Varmas Vyooham Movie

Vyooham Movie: రాంగోపాల్‌ వర్మ వ్యూహంకు బిగ్ షాక్.. మూవీ విడుదలకు కోర్టు బ్రేక్..!

రాంగోపాల్‌ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల నిలిచిపోయింది.

  • Author : Gopi Date : 23-12-2023 - 10:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vyooham Movie
Vyooham Movie Pre Release

Vyooham Movie: రాంగోపాల్‌ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల నిలిచిపోయింది. సినిమాపై నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్‌ సహా మరే వేదికల్లోనూ మూవీని విడుదల చేయకూడదని కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మ టీడీపీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా తీశారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో.. పిటిషనర్‌ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్‌ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని లోకేష్‌ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. అయితే డిసెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Golani Brigade : గాజా నుంచి పీఛేముడ్.. ఇంటికి చేరిన ఇజ్రాయెల్ గొలానీ బ్రిగేడ్‌

మరోవైపు.. వ్యూహం సినిమా ప్రిరిలీజ్‌కు యూనిట్ ఏర్పాట్లు చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు. మరోవైపు ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • nara lokesh
  • ram gopal varma
  • rgv
  • tdp
  • tollywood
  • Vyooham movie

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh

    AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Ram Gopal Varma stirred a political storm

    RGV: సంచలన పోస్ట్ షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd