Bhagavanth Kesari: బాలయ్య బాబు ఊచకోత షురూ.. మాస్ ఎలిమెంట్స్ తో ‘భగవంత్ కేసరి’ టీజర్
కొద్దిసేపటి క్రితమే బాలయ్య భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ అయ్యింది. బాలయ్య తెలంగాణ యాసలో అదరగొట్టాడు.
- By Balu J Published Date - 11:21 AM, Sat - 10 June 23

బాలయ్య బాబు (Nandamuri Balakrishna) అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య బాబు. అందుకే బాలయ్య ప్రతి సినిమా మాస్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకుంటాయి. పవర్ ఫుల్ డైలాగ్స్, వీరోచిత ఫైటింగ్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంటాడు ఆయన. ఈ నందమూరి నటసింహం నందమూరి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “భగవంత్ కేసరి (Bhagavanth Kesari)” పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు బాలయ్య బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ అదిరే ట్రీట్ ని సిద్ధం చేశారు.
ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. గూస్ బంప్స్ ఇచ్చే కంప్లీట్ మాస్ స్టఫ్ తో అయితే దీనిని డిజైన్ చేసారు. మెయిన్ గా బాలయ్య కొత్త డైలాగ్ డెలివరీతో తెలంగాణ యాసతో అదరగొట్టాడు. వీటితో పాటుగా బాలయ్య పై యాక్షన్ సీక్వెన్స్ లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండగా మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి.
థమన్ బాలయ్య కి లాస్ట్ టైం ఇచ్చిన రెండు సినిమాలు తరహాలో సాలిడ్ వర్క్ అయితే ఈ చిత్రానికీ అందించినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది. అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్ లోకి దిగిపోవడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. ‘ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే బాలయ్య డైలాగ్ తో ముగించారు. మొత్తానికి అయితే ఈ దసరా జాతర మామూలుగా ఉండదనే చెప్పాలి.