Krithi Shetty Belly Dance : బెల్లీ డాన్స్ తో బీభత్సం సృష్టిస్తున్న బేబమ్మ.. సోషల్ మీడియాలో రచ్చ..!
Krithi Shetty Belly Dance ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాల పరంగా తన వేగం తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అదరగొట్టేస్తుంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా చేస్తున్నా గ్లామర్ విషయంలో
- Author : Ramesh
Date : 10-02-2024 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
Krithi Shetty Belly Dance ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాల పరంగా తన వేగం తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అదరగొట్టేస్తుంది. ఇన్నాళ్లు హీరోయిన్ గా చేస్తున్నా గ్లామర్ విషయంలో కాస్త మొహమాట పడ్డ అమ్మడు ఈమధ్య రెచ్చిపోయి మరీ గ్లామర్ ట్రీట్ అందిస్తూ ఫోటో షూట్ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా తన బెల్లీ డాన్స్ తో బీభత్సం సృష్టిస్తుంది అమ్మడు.
ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో మెప్పించిన కృతి శెట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చేసిన అమ్మడు వాటిలో కథ గురించి ఆలోచించలేదు. అందుకే వరుస ఫ్లాపులు ఫేస్ చేయాల్సి వచ్చింది.
అందుకే ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడాలని చూస్తున్న అమ్మడు ఆచి తూచి అడుగులేస్తుంది. తన సోషల్ మీడియా ద్వారా క్రేజీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తున్న కృతి లేటెస్ట్ గా తన బెల్లీ డ్యాన్స్ తో కూడా అదరగొట్టేసింది. బేబమ్మ బెల్లీ డాన్స్ తో నడుము ఊపుడు చూసి సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది.
ఇదే ఊపు సినిమాల్లో చూపిస్తే మాత్రం అమ్మడికి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఏది ఏమైనా కృతి శెట్టి ఖాతాలో మరో హిట్ పడే దాకా అమ్మడు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో జత కడుతున్న కృతి మరో క్రేజీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.