Pawan – Balayya : పవన్ కోసం బాలయ్య త్యాగం..ఆలస్యంగా బయటకు వచ్చిన రహస్యం
Pawan - Balayya : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం, సినిమా విడుదల తేదీ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
- Author : Sudheer
Date : 13-12-2025 - 4:53 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియా lo ఫ్యాన్ వార్స్ శృతి మించుతున్న తరుణంలో, నందమూరి, మెగా కుటుంబాల హీరోలైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు సైతం ఫ్యాన్ వార్స్‌పై బహిరంగంగా మాట్లాడినా, అభిమానులు మాత్రం తమ పోరాటాలను ఆపడం లేదు. అయితే తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం, సినిమా విడుదల తేదీ విషయంలో బాలయ్య తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!
నిజానికి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ-2’ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 25న విడుదల కావాల్సింది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేయడంతో బాలయ్య తన సినిమా విడుదల తేదీని త్యాగం చేశారని దర్శకుడు బోయపాటి శ్రీను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలకృష్ణ స్వయంగా “తమ్ముడు సినిమా ‘ఓజీ’కి ఈసారి దారిద్దాం. ఒకరిపై ఒకరు పోటీ పడటం ఎందుకు?” అని చెప్పి ‘అఖండ-2’ విడుదలను వాయిదా వేయమని సూచించారట.
సాధారణంగా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లే పోస్ట్‌పోన్ అయిందనుకున్న అభిమానులకు, బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది. జూన్ చివరికే షూటింగ్ పూర్తి చేసి, ఆగస్టు 10 కల్లా రీరికార్డింగ్ కూడా పూర్తి చేసినప్పటికీ, పవన్ ‘ఓజీ’ కోసం బాలయ్య తన సినిమా విడుదల తేదీని త్యాగం చేయడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని పవన్ అభిమానులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం అఖండ 2 నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సాధించింది.