Balakrishna Simha: బాలయ్య బ్లాక్ బస్టర్ ‘సింహా’ రీరిలీజ్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ సినిమా 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది.
- By Balu J Published Date - 03:33 PM, Thu - 9 March 23

నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) అంటే బాక్సాఫీస్ కలెక్షన్లు.. బాక్సాఫీస్ కలెక్షన్లు అంటే నందమూరి బాలయ్య. బాలయ్య బాబు నుంచి సినిమా వస్తుందంటే మాస్ అభిమానుకు ఓ పండుగ లాంటింది. కానీ అలాంటి బాలయ్య (Nandamuri Balakrishna) కూడా కెరీర్ లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వరుసగా ఫెయిల్యూర్స్ ను ఇవ్వడంతో ‘ఇక బాలయ్య బాబు పని అయిపోయింది’ అనే విమర్శలు వినాల్సివచ్చింది.
సరిగ్గా అదే సమయంలో ‘సింహా’ అంటూ దూసుకువచ్చి బాక్సాఫీస్ (Box office) రికార్డులను షేక్ చేశాడు. తనలోని కొత్త యాంగిల్ ను బయటకు తీశాడు. డబుల్ రోల్ లో అదరగొట్టాడు. ఇప్పటికీ సింహా పాటలు, డైలాగ్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ‘‘చూడు ఒకవైపు చూడు.. రెండోవైపు చూడాలనుకోకు.. మాడిపోతావ్.. కుట్లు వేయడమే కాదు.. పోట్లు కూడా వేస్తా’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి.
బాలకృష్ణ, నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత ప్రధాన పాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ (Simha) సినిమా 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను ఈ నెల 11న రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో బాలయ్య (Nandamuri Balakrishna) ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని చూసేందుకు అభిమానులు ఇప్పట్నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Nagma: హీరోయిన్ నగ్మాను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు!

Related News

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?
ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.