Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ట్రైలర్ అదిరిందిగా..
ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
- By News Desk Published Date - 08:53 AM, Sun - 5 January 25

Daaku Maharaaj : సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో బాబీ దర్శకత్వలో బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ సినిమా తెరకెక్కుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రల్లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే డాకు మహారాజ్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటేనే బాలయ్య బాబు మరోసారి చైల్డ్ ఎమోషన్ తో పాటు తన యాక్షన్ కూడా చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అమెరికా డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Also Read : Nagababu : 100 రోజుల తర్వాతే.. నాగబాబుకు మంత్రి పదవి ?