Baby OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’లో ‘బేబీ’ (బేబీ ది మూవీ ఆన్ ఆహా) ప్రసారం కానుంది.
- By Balu J Published Date - 05:21 PM, Thu - 17 August 23
చిన్న సినిమాగా విడుదలైన ముక్కోణపు ప్రేమకథ ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న థియేటర్లలో విడుదలైంది.ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వైష్ణవి, ఆనంద్ దేవరకొండల నటన అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా OTTలో ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త.
ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’లో ‘బేబీ’ (బేబీ ది మూవీ ఆన్ ఆహా) ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ కంపెనీ ట్వీట్ చేసింది. అందరికీ “ఆహా” అంటే ఇష్టం. రేపు (శుక్రవారం) బేబీ మూవీ అప్డేట్ ఇవ్వబడుతుంది” .ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే వారం ‘బేబీ’ సినిమాను స్ట్రీమింగ్ కోసం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఆగస్టు 24 లేదా 25న ప్రసారం కావచ్చు.
సాధారణంగా ఓటీటీ సినిమాలు వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని విడుదలవుతాయి. (Baby movie ott) కానీ, ఇప్పుడు ఆ కంపెనీలు కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి కాకుండా, ముందు రోజు అంటే గురువారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో సినిమా చూడాలంటే అర్ధరాత్రి వరకు ఆగాల్సిన పనిలేదు. మరి ‘బేబీ’ ఏ రోజు, ఏ సమయానికి వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Also Read: Journalists: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం: అల్లం నారాయణ
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�