Ashish Vidyarthi : 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు..
గతంలో ఆశిష్ విద్యార్ధి రాజోషి(Rajoshi) అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం వీరిమధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
- Author : News Desk
Date : 25-05-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
నటుడు ఆశిష్ విద్యార్ధి(Ashish Vidyarthi) అందరికి సుపరిచితమే. తెలుగు, తమిళ్, హిందీ .. ఇలా దాదాపు 11 భాషల్లో ఆశిష్ విద్యార్ధి సినిమాలు చేశారు. తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్, కంత్రి, లక్ష్యం, అలా మొదలైంది, అదుర్స్, ఒంటరి, నాయక్, బాద్‌షా.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో చివరిసారిగా సుహాస్(Suhas) హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాలో తండ్రి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆశిష్ విద్యార్ధి 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
గతంలో ఆశిష్ విద్యార్ధి రాజోషి(Rajoshi) అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం వీరిమధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గత కొంతకాలంగా ఆశిష్ విద్యార్ధి అస్సాం(Assam)కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్(Fashion Designer) రూపాలి బారువా(Rupali Barua)తో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. రూపాలి బారువాకు పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. అంతే కాక పలు సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పనిచేస్తుంది.
తాజాగా వీరిపై వస్తున్న వార్తలు నిజం చేస్తూ నేడు ఉదయం ఆశిష్ విద్యార్ధి, రూపాలి బారువా అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆశిష్ విద్యార్ధి 60 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో మరింత వైరల్ గా మారింది ఈ వార్త.
Also Read : Ram Charan: ఆ మ్యాజిక్ జపాన్‌లోనే జరిగింది, ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ కామెంట్స్!