Ram Charan: ఆ మ్యాజిక్ జపాన్‌లోనే జరిగింది, ఉపాసన ప్రెగ్నెన్సీపై రామ్ చరణ్ కామెంట్స్!
జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో తన భార్య ఉపాసన గర్భం దాల్చిందని రామ్ చరణ్ చెప్పాడు.
- Author : Balu J
Date : 25-05-2023 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ (Ram Charan) చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఏ క్షణాన అస్కార్ అవార్డు అందుకున్నాడో, ఆ రోజు నుంచే గ్లోబల్ స్టార్ ను ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఈ ఆర్ఆర్ఆర్ హీరో శ్రీనగర్‌లో జరిగిన జి 20 సమ్మిట్‌కు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జపాన్ (Japan) కంట్రీ తనకు చాలా ప్రత్యేకమని, ఆ దేశం తనకు ఎందుకు ఇష్టమైన ప్రదేశమో చెప్పాడు.
ఉపాసన ప్రెగ్నెన్సీ (pregnancy)కి కారణమైన ఆ మ్యూజిక్ జపాన్ లో జరిగిందని అన్నాడు. రామ్ చరణ్‌కు తాను సందర్శించే దేశాల నుండి కళాఖండాలను సేకరించే అలవాటు ఉంది. ‘‘యూరప్ ఎప్పుడూ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు, జపాన్ నా కొత్త ఇష్టమైన దేశంగా మారింది… సంస్కృతి… ప్రజలు. ఇది ప్రత్యేకమైన దేశం, ఎందుకో నేను మీకు చెప్తాను’’ అంటూ అసలు విషయం చెప్పాడు నవ్వుతూ.
“నా భార్య… ఆమె ప్రస్తుతం గర్భవతి. ఆమెకు ఏడో నెల. అయితే జపాన్‌లో మా ఇద్దరి మధ్య మ్యాజిక్ జరగడం వల్లనే ఉపాసన ప్రెగ్నెన్సీ అయ్యింది. రామ్, ఉపాసన్ (Upasana)తో పాటు RRR మూవీ బృందం సభ్యులు జపాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో రామ్ చరణ్, ఉపాసన అనేక ప్రాంతాలను తిరిగి ఏకాంతంగా గడిపారు. అయితే జపాన్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఉపాసన గర్భం దాల్చిందని చెప్పాడు. అయితే రామ్ చరణ్, ఉపాసనకు అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడుతుందా అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. రామ్ చరణ్ ఓ సందర్భంలో తమకు అమ్మాయి పుడుతుందని పరోక్షంగా చెప్పారు.
Also Read: CM Siddaramaiah: సిద్ధరామయ్యకు ప్రాణహాని.. కర్ణాటకలో చిచ్చు రేపుతున్న వ్యాఖ్యలు!