ఆద్యంతం అలరించే “అసలేం జరిగిందంటే.”..? అక్టోబర్ 1 విడుదల!!
"అసలు ఏం జరిగిందంటే చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది.
- By Hashtag U Published Date - 02:36 PM, Fri - 24 September 21

“అసలు ఏం జరిగిందంటే చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది. “పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి” తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి మరియు దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని.. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు.
జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు. ఎమ్.జి.ఎమ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, సాహిత్యం-సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి, నిర్మాణం: జి.ఎస్.ఫిల్మ్స్,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ బండారి!!
Related News

Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఎప్పుడో తెలుసా
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దసరాకు లేదంటే దీపావళికి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేదంటే.. గ్లిమ్స్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. గేమ్ ఛేంజర్ కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తే.. హీరోకు గాయం కారణంగా షూటింగ్ వాయిదాపడింది. రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో.. షూటింగ్ అక్టోబర్ 5కు పోస్ట్ పోన్