Renu Desai : మంత్రి కొండా సురేఖను కలిసిన రేణూ దేశాయ్
తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు
- Author : Sudheer
Date : 26-07-2024 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ నటి , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)..శుక్రవారం తెలంగాణ మంత్రి కొండా సురేఖను ( Konda Surekha ) కలిశారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రి ఇంట్లో సమావేశమయ్యారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. సహజంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఎవరినైనా అత్యంత ఆప్యాయంగా పలకరించే కొండ సురేఖ తన ఇంటికి వచ్చిన రేణు దేశాయ్ ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్ కు తన స్వహస్తాలతో అలంకరించి ఆదరాభిమానాలను చూపించారు. మంత్రి కొండా కుటుంబ సభ్యులు తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Read Also : SEBI Bans Vijay Mallya: విజయ్ మాల్యాకు షాకిచ్చిన సెబీ.. మూడేళ్లపాటు నిషేధం..!