Arjun Son of Vyjayanthi : ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పబ్లిక్ టాక్
Arjun Son of Vyjayanthi : సెకండాఫ్ లో ఎమోషన్స్, మాస్ యాక్షన్, బీజీఎం పీక్స్‌కి తీసుకెళ్లి ఆకట్టుకుంటాయని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని మళ్లీ వెండితెరపై చూడటం ఎంతో సంతోషంగా ఉందని మరికొందరు అంటున్నారు
- Author : Sudheer
Date : 18-04-2025 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
కళ్యాణ్ రామ్, విజయశాంతి (Nandamuri Kalyan Ram, Saiee Manjrekar, Vijayashanti) ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి ( Arjun Son of Vyjayanthi ). టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈరోజు ఏప్రిల్ 18న రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందనేది ఆడియన్స్ టాక్ ద్వారా తెలుసుకుందాం.
తల్లి-కొడుకుల మధ్య ఎమోషనల్ బాండ్‌ను ప్రధానంగా చూపిస్తూ సినిమా ప్రారంభమైనా, కథ మళ్లీ సాధారణ టెంప్లెట్‌లోకి వెళ్లిపోయిందని కొందరు చెబుతున్నారు. మ్యూజిక్ కానీ బ్యాక్ గ్రౌండ్ గానీ పెద్దగా లేదని, ఎలివేషన్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. కొన్ని సీన్‌లు బాగున్నప్పటికీ, ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉంది అని అంటున్నారు.
ముఖ్యంగా కల్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత పోలీస్ పాత్రలో కనిపించడంతో నందమూరి అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ బాగుండడంతో సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెకండాఫ్ లో ఎమోషన్స్, మాస్ యాక్షన్, బీజీఎం పీక్స్‌కి తీసుకెళ్లి ఆకట్టుకుంటాయని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని మళ్లీ వెండితెరపై చూడటం ఎంతో సంతోషంగా ఉందని మరికొందరు అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు మిక్సెడ్ టాక్ అయితే నడుస్తుంది. ఫైనల్ గా సినిమా ఫలితం ఏంటి అనేది కాసేపట్లో తెలుస్తుంది.