Shalini Pandey : అర్జున్ రెడ్డి భామ అందాల ఎటాక్..!
Shalini Pandey మళ్లీ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకునే అవకాశం కోసం ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. అర్జున్ రెడ్డి భామ లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డ్రస్ లో
- By Ramesh Published Date - 11:51 PM, Mon - 13 January 25

అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షాలిని పాండే ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ క్రేజ్ రాగా హీరోయిన్ గా అమ్మడికి మాత్రం కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో వరుస సినిమా ఆఫర్లు వచ్చినా అవేవి కలిసి రాలేదు. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేయగా అక్కడ ఆశించిన క్రేజ్ రాలేదు. ఐతే ఇక ఫైనల్ గా అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ సినిమాలు చేస్తుంది.
అక్కడ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అమ్మడు దూసుకెళ్తుంది. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ పడ్డాక మామూలుగా అయితే స్టార్ రేంజ్ కి వెళ్తుందని అనుకుంటారు. కానీ ఎందుకో టైం కలిసి రాలేదు. చివరగా మహారాజ్ సినిమాతో లాస్ట్ ఇయర్ మరో ఛాన్స్ వచ్చినా అది నిరాశపరచింది.
ఐతే అమ్మడు మళ్లీ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకునే అవకాశం కోసం ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. అర్జున్ రెడ్డి భామ లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డ్రస్ లో అమ్మడు లుక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. టాలీవుడ్ కి పూర్తిగా దూరమైన అమ్మడు మళ్లీ ఇక్కడ ఛాన్స్ లు రాబట్టాలని చూస్తుంది.
షాలిని పాండే కి ఒక హిట్ పడితే బాగుంటుందని అర్జున్ రెడ్డి సినిమా లవర్స్ అనుకుంటున్నారు. మరి అమ్మడికి అవకాశాలు ఎందుకు రావట్లేదు అన్నది ఎవరికి అర్ధం కావట్లేదు.