Appudo Ippudo Eppudo Trailer : నిఖిల్ ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధంగా ఉండండి..
Appudo Ippudo Eppudo Trailer : ఈ సినిమా ఈనెల 8న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. నిఖిల్ ప్రస్తుతం "స్వయంభు" మరియు "ఇండియా హౌస్" అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు
- Author : Sudheer
Date : 03-11-2024 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
కార్తికేయ ఫేమ్ నిఖిల్ (Nikhil) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. నిఖిల్ సిద్దార్థ హీరోగా నటించిన “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” (Appudo Ippudo Eppudo) సినిమా ట్రైలర్‌ను రేపు (నవంబర్ 04) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించగా.. హర్ష చెముడు ముఖ్య పాత్రను పోషించారు.
ఈ సినిమా ఈనెల 8న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. నిఖిల్ ప్రస్తుతం “స్వయంభు” మరియు “ఇండియా హౌస్” అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. నిఖిల్ నటించిన గత చిత్రాలు సూపర్ హిట్ కావడం తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పై అంచనాలు నెలకొని ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘నీతో ఇలా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS