Anushka Sharma : ఒక్కటైన విక్కీ, కత్రినా.. అనుష్క శర్మ ఇంట్రస్టింగ్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ జంట ఎప్పుడైతే వివాహ ప్రకటన చేశారో.. అప్పట్నుంచే అభిమానులు, శ్రయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.
- By Balu J Published Date - 03:42 PM, Fri - 10 December 21
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ జంట ఎప్పుడైతే వివాహ ప్రకటన చేశారో.. అప్పట్నుంచే అభిమానులు, శ్రయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు, ఇరు కుటుంబాలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అయితే బాలీవుడ్ నటి అనుష్క శర్మ, కత్రినాల మధ్య మంచి స్నేహం ఉంది. కత్రినా, అనుష్క జబ్ తక్ హై జాన్, జీరో వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా అనుష్కశర్మ తన ఇన్ స్టాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు.
“అందమైన జంటకు అభినందనలు! మీకు జీవితకాలం కలిసిమెలిసి, ప్రేమ, అవగాహనతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు త్వరలో మీ ఇంటికి మారవచ్చు. ఇకనైన నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచే వచ్చే శబ్దాలు వినడం మానేస్తాం’’ అంటూ రాసుకొచ్చింది. అయితే పెళ్లికి ముందు కత్రినా జుహూలోని సీఫేసింగ్ అపార్ట్మెంట్లో ఉండేదట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన ఈ జంట అనుష్కశర్మ ఇంటికి ఎదురుగా ఓ కొత్తింట్లోకి అడుగుపెట్టనున్నారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న జైపూర్లోని రణతంబోర్ సమీపంలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహం అయ్యే వరకు వారి రిలేషన్ గురించి ఎక్కడా బహిర్గత పర్చలేదు. పెళ్లి తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఈ క్షణానికి మమ్మల్ని తీసుకువచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞత కలిగి ఉంటాం. మేం కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకెంతో అవసరం.
Related News
NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. అక్కడ స్పెషల్ పార్టీ ప్లానింగ్..?
NTR RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడు