Raviteja Mr Bacchan : రవితేజ మిస్టర్ బచ్చన్ లో మరో హీరో..!
వితేజ మిస్టర్ బచ్చన్ (Raviteja Mr Bacchan) సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మాస్ రాజా సినిమాలో మరో హీరోనా ఎవరా అంటూ ఆడియన్స్
- By Ramesh Published Date - 10:40 PM, Mon - 22 July 24

మాస్ మహరాజ్ రవితేజ (Mass Maharaj Raviteja) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ, హరీష్ శంకర్ మిరపకాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో ఇన్నాళ్లకు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ కి తగినట్టుగానే ఈమధ్య వచ్చిన షో రీల్ ఫ్యాన్స్ ని మెప్పించింది. రవితేజ మిస్టర్ లో బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.
ఐతే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. రవితేజ మిస్టర్ బచ్చన్ (Raviteja Mr Bacchan) సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మాస్ రాజా సినిమాలో మరో హీరోనా ఎవరా అంటూ ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉంటున్నాడని తెలుస్తుంది. స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈమధ్య డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
అతను సినిమాలో ఉంటున్నాడు అంటే సినిమాపై మరింత హైప్ ఏర్పడుతుంది. ఇంతకీ సిద్ధు (Siddhu Jonnalagadda)ని రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో ఎలా వాడారన్నది చూడాలి. బాలీవుడ్ రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో మాస్ రాజా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలు పెట్టిన హరీష్ శంకర్ అది ఎంతకీ పూర్తి కావట్లేదని ఆ సినిమాను మధ్యలో ఆపి రవితేజ సినిమా మొదలు పెట్టాడు. ఈ నెల చివరి కల్లా సినిమా పూర్తి చేసి ఆగష్టు 15కి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Puri Jagannath Vs Raviteja : పూరీ వర్సెస్ రవితేజ.. ఫైట్ లో గెలిచేది ఎవరు..?