Anil Ravipudi Raviteja మాస్ రాజాతో అనిల్ ఫిక్స్.. రాజా డబుల్ గ్రేట్ లైన్ చేస్తారా..?
Anil Ravipudi Raviteja టాలీవుడ్ హిట్ మిషిన్ లా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపుడి.
- Author : Ramesh
Date : 10-11-2023 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
Anil Ravipudi Raviteja టాలీవుడ్ హిట్ మిషిన్ లా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపుడి. బాలయ్యతో భగవంత్ కేసరి లాంటి అటెంప్ట్ డైరెక్టర్ గా అతనికి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ (Anil Ravipudi) తో సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తికరంగా ఉన్నారు. అయితే అనిల్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న దానికి క్లారిటీ వచ్చింది.
అనిల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా మాస్ మహరాజ్ రవితేజ (Raviteja)తో ఫిక్స్ చేసుకున్నాడని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ అనిల్ తో రాజా ది గ్రేట్ సినిమా చేసిన రవితేజ ఆ సినిమాకు కొనసాగింపుగా చేయాలని అనుకున్నారు. రాజా డబుల్ గ్రేట్ టైటిల్ కూడా బయటకు వచ్చింది.
Also Read : Balakrishna : నాకు నేనే పోటీ.. ఆ దమ్ము ధైర్యం ఉందంటున్న బాలకృష్ణ..!
మరి అనిల్ తో రవితేజ రాజా డబుల్ గ్రేట్ చేస్తాడా లేదా మరో సినిమా చేస్తాడా అన్నది చూడాలి. రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలతో రవితేజ దూకుడు మీద ఉన్నాడు. రవితేజ అనిల్ రావిపుడి సినిమాకు ఇద్దరు కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమాతో నిరాశపరిచాడు. ఈగల్ తో మళ్లీహిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న మాస్ రాజా అనిల్ తో సినిమా మాత్రం టార్గెట్ పెద్దదిగానే పెట్టుకుంట్టు తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join