Anasuya : గ్లామరస్ భామ వైల్డ్ రోల్ రచ్చ.. సుక్కు ప్లాన్ లు అన్ని ఇలానే ఉంటాయ్..!
Anasuya ఒక సూపర్ హిట్ సినిమాలో ఆడియన్స్ కు బాగా తెలిసిన ఒక బ్యూటీని డిఫరెంట్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుంది. వారికి ముందున్న ఇమేజ్ ఏదైనా ఆ పాత్ర చేయడం
- Author : Ramesh
Date : 17-05-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
Anasuya ఒక సూపర్ హిట్ సినిమాలో ఆడియన్స్ కు బాగా తెలిసిన ఒక బ్యూటీని డిఫరెంట్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుంది. వారికి ముందున్న ఇమేజ్ ఏదైనా ఆ పాత్ర చేయడం వల్ల మారిపోతుంది. అలా సుకుమార్ డైరెక్షన్ లో గ్లామరస్ ఇమేజ్ ఉన్న అనసూయ కాస్త వైల్డ్ రోల్ లో మారడం అందరికీ తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అనసూయని రంగమ్మత్త పాత్రలో చూపించాడు.
ఆ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అదరగొట్టేసింది. ఆ తర్వాత అనసూయకు అదే తరహా పాత్రలు చాలా వచ్చాయి. అయితే మరోసారి సుకుమార్ అనసూయని మరో డిఫరెంట్ రోల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే పుష్ప 1 లో దాక్షాయణి పాత్రలో వైల్డ్ గా చూపించాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్య దాక్షాయణిగా అనసూయ అదరగొట్టేసింది.

ఇక పుష్ప 2 లో దాక్షాయణి పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అసలే తన తమ్ముడిని చంపిన కసితో రగిలిపోయే దాక్షాయణి పుష్ప 2 లో మరింత ఆవేశంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సుకుమార్ క్రియేట్ చేసిన పాత్రల వల్ల అనసూయ తన కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తుంది.
పుష్ప 2 సినిమాలో అనసూయ పోస్టర్ రీసెంట్ గా ఆమె బర్త్ డే నాడు రిలీజ్ చేశారు. ఆఫ్ స్క్రీన్ లో థై షోతో అదరగొడుతుంటే ఆన్ స్క్రీన్ దాక్షాయణిగా బాబోయ్ అనిపించేలా ఉంది అనసూయ. ఏది ఏమైనా నటిగా అనసూయ కెరీర్ లో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తూ సత్తా చాటుతుందని చెప్పొచ్చు.
Also Read : Manchu Vishnu Kannappa Release : కన్నప్ప ఆ పండగకి ప్లాన్ చేస్తున్నాడా.. పోటీ తట్టుకోగలడా..?