Simbaa Movie : ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ ‘సింబా’..
సింబా సినిమా ఇటీవల సెప్టెంబర్ 6 అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది.
- Author : News Desk
Date : 16-09-2024 - 4:34 IST
Published By : Hashtagu Telugu Desk
Simbaa Movie : సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సింబా’. ఈ సినిమాలో అనసూయ(Anasuya), జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఓ మెసెజ్ ఓరియెంటెడ్ కథని థ్రిల్లర్ కాన్సెప్ట్ గా చూపించారు ఈ సినిమాలో.
వృక్షో రక్షతి రక్షితః, చెట్లను పెంచాలి అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు. కానీ డైరెక్ట్ గా అదే చెప్తే ఒక మెసేజ్ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మంచి థ్రిల్లింగ్ కథాంశంతో సెల్యులార్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాని ఒక రివెంజ్ డ్రామాలా తెరకెక్కించారు.
ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజయిన సింబా సినిమా ఇటీవల సెప్టెంబర్ 6 అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం సింబా మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్ అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 5లో సింబా సినిమా ట్రెండ్ లో నిలిచింది. డైరెక్టర్ మురళి మనోహర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇవ్వడమే కాకుండా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ని చూపించాడు. ఓటీటీలో సింబా సినిమా మరింత ఆదరణ పొందడం ఖాయం.

Also Read : Jani Master : జనసేన పార్టీకి దూరంగా ఉండాలి.. జానీ మాస్టర్ కి పార్టీ ఆదేశాలు..