కోటకు అనసూయ కౌంటర్.. అదంతా వ్యక్తిగతమంటూ ఫైర్!
అనసూయ.. ఒకవైపు బుల్లితెర యాంకర్ గా మెప్పిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది ఈ యాంకరమ్మ.
- By Balu J Published Date - 12:12 PM, Tue - 19 October 21
అనసూయ.. ఒకవైపు బుల్లితెర యాంకర్ గా మెప్పిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది ఈ యాంకరమ్మ. పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా తన అందచందాలతో ప్రేక్షకులను మైస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మ అత్తగా నటించి, మంచి పేరు తెచ్చుకుంది. అయితే పద్ధతిగా చీర కడుతూనే, మరోవైపు పొట్టి దుస్తులు సైతం ధరించడానికి వెనుకాడదు.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనసూయ డ్రెస్సింగ్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారని ఆయన అన్నారు. అందుకే అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదని మనసులో మాట బయటపెట్టారు కోట శ్రీనివాసరావు. అనసూయ చక్కటి నటి కానీ ఆమె డ్రెస్సింగ్ తనకు నచ్చదని తేల్చి చెప్పారు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని కోట కామెంట్స్ చేయడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది.
అయితే కోట కామెంట్స్ పై అనసూయ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆయనపై కోపాన్ని ప్రదర్శిస్తూ ట్విట్టర్లో పోస్టుల మీదు పోస్టులు పెడుతోంది. “కోట కామెంట్స్ నేను చూశాను. ఈ డ్రెస్సింగ్ ఎంపిక అనేది వ్యక్తిగతమైంది. వృత్తిలో భాగంగా డిఫరెంట్ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. అదే సీనియర్ నటులు మందుకొడితే.. అసభ్యంగా మాట్లాడితే మీడియాలో ఎందుకు సైలంట్ గా ఉంటుంది. పెళ్లైన హీరోహీరోయిన్లు సైతం సినిమాల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ యాంకర్ అనసూయ కోటపై సీరియఎస్ అయ్యారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021
Tags
Related News
Child Born With Tail : చైనాలో తోకతో పుట్టిన పాప.. అద్భుతమంటున్న జనాలు
తాజాగా చైనా దేశంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ మగ శిశువు తోకతో (Child Born With Tail) జన్మించాడు. హాంగ్ఝౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన ఈ శిశువును చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఒక శిశువుకు వెనుక నుండి నాలుగు అంగుళాల తోకతో పుట్టడంతో.. ఈ పరిస్థితి వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.. అయితే… పీడియాట్రిక్ న్యూరోసర్జరీ డిప్యూటీ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్. లి, హాంగ్