Ananya Pandey : లైగర్ భామ అతనితో డేటింగ్.. ఆ షోలో కన్ఫర్మ్ చేసిందిగా..!
బాలీవుడ్ భామ అనన్యా పాండే (Ananya Pandey) తెలుగులో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన
- Author : Ramesh
Date : 06-11-2023 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ భామ అనన్యా పాండే (Ananya Pandey) తెలుగులో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా రిలీజ్ అవ్వగా సినిమా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ సినిమాలో నటించిన అనన్యా పాండే కి మళ్లీ తెలుగు నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా బాలీవుడ్ లో బిజీగా ఉంటుంది కాబట్టి అమ్మడు ఇక్కడ్ సినిమాలు చేయాలని అనుకోవట్లేదు.
ఇక కొన్నాళ్లుగా అనన్యా పాండే ఆదిత్య రాయ్ కపూర్ (Adhitya Roy Kapoor) తో డేటింగ్ లో ఉంటుందని వార్తలు రాగా ఇప్పుడు వాటిని కన్ ఫర్మ్ చేస్తూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనన్యా పాండే బర్త్ డే సందర్భంగా ఆదిత్యా రాయ్ కపూర్ తో మాల్దీవ్స్ వెళ్లింది అనన్య. అక్కడ ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఇద్దరు కలిసి మళ్లీ తిరిగి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో కరణ్ అడిగితే సారా అలి ఖాన్ అనన్యా పాండే కాదు అనన్యా రాయ్ కపూర్ అని సమాధానం ఇచ్చింది.
అనన్యా పాండే కూడా తమ మధ్య ఉన్న రిలేషన్ నిజమే అన్నట్టుగా చెప్పుకొచ్చింది. హిందీలో వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లతో దూసుకెళ్తున్న అనన్యా పాండే ఫలితాలతో సంబంధం లేకుండా చేస్తూ వెళ్తుంది. ఆదిత్యాతో లవ్ స్టోరీ నడిపిస్తున్న అనన్యా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని ముంబై మీడియా కోడై కూస్తుంది.
Also Read : Venkatesh : తమిళ దర్శకుడితో వెంకటేష్..?
We’re now on WhatsApp : Click to Join