Amy Jackson : పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్..
ఇంగ్లిష్ యాక్టర్, మ్యుజీషియన్ ఎడ్ విస్ట్‌విక్ ను వివాహం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు అమీ జాక్స్ షేర్ చేస్తూ.. ‘ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది
- By Sudheer Published Date - 09:15 PM, Sun - 25 August 24

అమీ జాక్సన్ (Amy Jackson) సినీ లవర్స్ కు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బ్రిటిష్ – ఇండియన్ అయిన ఈ భామ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. తెలుగు లో మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. ఇంగ్లిష్ యాక్టర్, మ్యుజీషియన్ ఎడ్ విస్ట్‌విక్ (Ed Westwick) ను వివాహం (Married) చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు అమీ జాక్స్ షేర్ చేస్తూ.. ‘ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా.. అమీ జాక్సన్‌కు ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. గతంలో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్‌మెన్‌తో ప్రయాణం నడిపి.. 2019లో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనించింది. వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలువలేదు. చివరకు 2022లో పనయోట్టుతో తనబంధం ముగిసిందని ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత అమీ జాక్సన్ హాలీవుడ్ స్టార్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఇద్దరు..ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. రెండో మొగుడి తోనైనా సరిగా ఉంటుందో లేదో చూడాలి.
Read Also : N Convention Demolition : ఫ్యాన్స్ కు నాగార్జున రిక్వెస్ట్..