Kamal Haasan : తనకంటే కమల్ హాసన్ పాత్ర ఎక్కువ హైలెట్ అవుతుందని.. సినిమా ఆపేసిన అమితాబ్..
1984లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఖబడ్ధార్’ అనే సినిమా మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ తో యమగోల వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన తాతనేని రామారావు ఈ ఖబర్దార్ సినిమాకి దర్శకత్వం వహించారు.
- Author : News Desk
Date : 03-07-2023 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు రాసుకున్న పాత్రకి తన నటనతో ప్రాణం పోసి ప్రేక్షకుల గుండెల్లో ఆ పాత్రని ఎన్నో ఏళ్లు జీవించేలా చేస్తాడు. మరి అంతటి గొప్ప నటుడిని చూస్తే ఎవరికైనా కొంచమైనా ఈర్ష కలగడం సహజం. అలా కమల్ ని చూసి బాలీవుడ్(Bollywood) బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కి కూడా కొసరంత ఈర్ష కలిగిందట. దానివల్లే మొదలుపెట్టి చాలా భాగం షూటింగ్ జరిపిన ఒక సినిమాని అర్దాంతరంగా ఆపేశాడట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్(K Bhagyaraj) ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
1984లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఖబడ్ధార్’ అనే సినిమా మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ తో యమగోల వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన తాతనేని రామారావు ఈ ఖబర్దార్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమితాబచ్చన్ డాక్టర్ గా నటించాడు. ఇక కమల్ హాసన్ ఒక మెంటల్లీ చాలెంజ్డ్ పేషంట్ లా నటించాడు. ఈ మూవీ మొదలయ్యి దాదాపు సగం పైనే షూటింగ్ జరుపుకుంది. అయితే సడన్ గా ఆ మూవీని నిలిపివేశారు. అప్పట్లో అసలు కారణమేంటో తెలియకుండానే మిగిలిపోయింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా ఆగిపోవడానికి కారణం అమితాబ్ బచ్చన్ కి కలిగిన ఈర్షే అంటూ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.
ఆ సినిమాలో అమితాబ్ పాత్ర కంటే కమల్ పాత్ర ఎక్కువ హైలెట్ అవుతుందట. అందువలనే అమితాబ్ ఆ సినిమాని మధ్యలోనే ఆపేసినట్లు భాగ్యరాజ్ తెలియజేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాతి సంవత్సరంలోనే అమితాబ్ అండ్ కమల్.. అన్నదమ్ములుగా నటిస్తూ ‘గెరాఫ్తార్’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయడం మరో విశేషం. ఆ సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్, కమలహాసన్ మళ్లీ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నారు.
Tollywood : ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో కనిపెట్టారో..? మొదటి సినిమాకే బెస్ట్ యాక్టర్ అవార్డు..