Amala Paul: అమలాపాల్ కు లైంగిక వేధింపులు.. మాజీ ప్రియుడిపై కంప్లైంట్!
వ్యాపార ఒప్పందంలో మోసం చేసి, తన ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని
- By Balu J Published Date - 09:52 PM, Tue - 30 August 22

వ్యాపార ఒప్పందంలో మోసం చేసి, తన ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించినందుకు అమలా పాల్.. చెన్నైలోని విల్లుపురం జిల్లాలో మాజీ ప్రియుడు భవిందర్ సింగ్ దత్‌పై పోలీసు కేసు నమోదు చేసింది. భవినీందర్ సింగ్‌ను విల్లుపురం క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసులు అతనిపై ఫోర్జరీ, బెదిరింపు , వేధింపులతో సహా 16 వేర్వేరు చట్టపరమైన నిబంధనల కింద ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నేరంలో ప్రమేయం ఉన్న 11 మంది అదనపు నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం వారి కోసం వెతుకుతున్నారు. గతంలో ప్రేమాయణం సాగించిన అమల, భవిందర్ విడిపోయిన తర్వాత విడిపోయినట్లు సమాచారం.