Allu Ayaan : అల్లు అయాన్ చెఫ్ అవుతాడా? ప్రొఫెషనల్ చెఫ్‌గా మారిన అయాన్ ఫోటో వైరల్..
స్నేహ తాజాగా అల్లు అయాన్ చెఫ్ గా మారిన ఫోటో షేర్ చేసింది.
- By News Desk Published Date - 06:47 PM, Sun - 8 September 24

Allu Ayaan : అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాడు. తను చేసే అల్లరి పనులతో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతాయి. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా అర్హ, అయాన్ ఫోటోలు, వీడియోలు రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది. నిన్నే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్ చేసిన స్నేహ తాజాగా అల్లు అయాన్ చెఫ్ గా మారిన ఫోటో షేర్ చేసింది.
అల్లు అయాన్ ప్రొఫెషనల్ చెఫ్ గా మారి మరో ఇద్దరితో కలిసి ఏదో ఐటెం తయారు చేయడం నేర్చుకుంటున్నట్టు ఉన్న ఫొటోని అల్లు స్నేహ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి అల్లు అయాన్ చెఫ్ అవుతాడా? లేక స్కూల్ లో చెఫ్ ప్రోగ్రాం ఏమన్నా చేయించారా? లేదా సరదాగా టైంపాస్ కి తెలిసిన రెస్టారెంట్ లో ఇలా కాసేపు చెఫ్ గా మారాడా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి చెఫ్ గెటప్ లో అల్లు అయాన్ మరోసారి వైరల్ గా మారాడు.

Also Read : Jr NTR : ముంబైలో ఎన్టీఆర్.. బాలీవుడ్ నుంచి మొదలుపెట్టిన ‘దేవర’ ప్రమోషన్స్..