Allu Arjun : సినిమాల్లోకి అల్లు అర్జున్ భార్య….స్టార్ హీరో మూవీతో తెరంగేట్రం..!!
- By hashtagu Published Date - 10:22 PM, Thu - 3 November 22

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి…సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి…ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను షేర్ చేస్తుంది. ఈ మధ్య తన ఫోటో షూట్స్ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంది. హీరోయిన్లకు మించిన అందంతో కట్టేపడేసే ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది స్నేహారెడ్డి. అయితే స్నేహారెడ్డి ఓ మలయాల మూవీ లో నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే అందులో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
హీరోయిన్ గా చేయదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుందా లేదా ఇంకేదైనా పాత్రలో నటిస్తుందా అనేది సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన స్నేహారెడ్డి…ఎలాంటి రోల్ చేస్తుందా అనేది చూడాల్సిందే. కాగా అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ తో స్నేహారెడ్డి మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.