Allu Arjun Remuneration : ఒక్క యాడ్ కు రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్న పుష్పరాజ్…తగ్గేదేలే
- Author : Sudheer
Date : 15-11-2023 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్పరాజ్..ఈ పాత్ర అల్లు అర్జున్ (Allu Arjun) ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. పుష్ప (Pushpa) మూవీ వరకు కూడా అల్లు అర్జున్ కు తెలుగు లో తప్ప బయట భాషల్లో పెద్దగా క్రేజ్ లేదు కానీ పుష్ప మూవీ తో అన్ని భాషల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తో ఏకంగా జాతీయ అవార్డు (Allu Arjun National Award) అందుకొని మరింత ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం బన్నీ క్రేజ్ మాములుగా లేదు. ఆయనతో ఓ సినిమా చేయాలన్న..ఓ యాడ్ (Ad)చేయాలని నిర్వాకులు భారీగా ముట్టచెప్పాల్సిందే. ఆ రేంజ్ కి ఎదిగాడు. ఒకప్పుడు ఓ యాడ్ కు లక్షల్లో రెమ్యూనరేషన్ (Remuneration ) తీసుకునే బన్నీ..ఇప్పుడు కోట్లలో డిమాండ్ చేస్తున్నాడట. ఆయన అడిగిన దానికి ఏమాత్రం ఆలోచించకుండా నిర్వాహకులు సైతం ఇస్తున్నారట. తాజాగా జొమాటో (Zomato Ad) నిర్వాహకులు దాదాపు రూ. 6 నుండి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చి యాడ్ చేయించుకున్నారని ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అప్పట్లో జొమాటో యాడ్ చేసిన బన్నీ… ఈ యాడ్ కోసం ఏకంగా రూ. 35 లక్షల ను అందుకునేవాడట. గతంలో స్టార్ హీరోలందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ కు ఓ పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక యాడ్ చేయడం కోసం ఏకంగా ఎవరు ఛార్జ్ చేయని విధంగా అందుకుంటున్నారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బన్నీ.. ఈ సంస్థ కోసం ఒక్కో యాడ్ కు రూ.6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఆ రేంజ్ లో బన్నీ వెళ్లాడు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పుష్ప 2 మూవీ తో బిజీ గా ఉన్నాడు.
Read Also : Payal Rajput: ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు: పాయల్ రాజ్ పుత్