Bunny Vs Sukku : అల్లు అర్జున్ – సుకుమార్ మధ్య కోల్డ్ వార్..?
కొన్ని విషయాలు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత ఇది నిజమా అనే సందేహమూ వస్తుంది. బట్.. ప్రొజెక్టర్ లేకుండా సినిమా బొమ్మ కనిపించదు అనేది ఎంత నిజమో.. ఎక్కడో నిజం లేకుండా రూమర్ బయటకు రాదు అనేదీ అంతే నిజం.
- By hashtagu Published Date - 02:10 PM, Tue - 14 December 21

కొన్ని విషయాలు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత ఇది నిజమా అనే సందేహమూ వస్తుంది. బట్.. ప్రొజెక్టర్ లేకుండా సినిమా బొమ్మ కనిపించదు అనేది ఎంత నిజమో.. ఎక్కడో నిజం లేకుండా రూమర్ బయటకు రాదు అనేదీ అంతే నిజం. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా వినిపిస్తోన్న వార్త ఇదే. అల్లు అర్జున్ – సుకుమార్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని. ఇందుకు మారేడుమిల్లి అడువులే ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా చెప్పుకుంటున్నారు. మరి ఆ అడవుల్లో ఏం జరిగిందీ అనేదే అందర్లోనూ కుతూహాలాన్ని రేపుతోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో లో ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చాయి. ఇది మూడోది. అందువల్ల ఇద్దరి మధ్య మంచి రాపో అంటుంది కదా అనుకుంటారు చాలామంది. కానీ ఈ మధ్య అల్లు అర్జున్ బాగా మారాడు అని అతన్ని గమనిస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మార్పే ఈ కోల్డ్ వార్ కు ఇన్ డైరెక్ట్ రీజన్ అయిందంటున్నారు. మరి వీరి మధ్య అసలు ఏం జరిగింది..?
పుష్ప సినిమాను ఒకే భాగంలో ఫినిష్ చేయాలనేది సుకుమార్ ఆలోచన. కానీ దాన్ని రెండు భాగాలుగా చెప్పాల్సిందే అని పట్టుబట్టింది అల్లు అర్జున్ అంటారు. అందులో ఎంత వరకు నిజముందీ అనేది పక్కన బెడితే.. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అల్లు అర్జున్ ఈ మూవీ మేకింగ్ టూమచ్ గా ఇన్వాల్వ్ అయ్యాడట. సుకుమార్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ను కూడా పక్కన బెట్టి కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను తను చెప్పినట్టే చేయించుకున్నాడని టాక్. ఇదే కాక తన మేకోవర్ విషయంలోనూ చాలాసార్లు సుకుమార్ ను కాదని వెళ్లాడట. ముఖ్యంగా ఫైట్స్ తో పాటు డ్యాన్స్ ల విషయంలో సుకుమార్ ను పూర్తిగా పక్కనబెట్టినంత పనిచేశాడని.. సెట్ లో ఉన్న సుకుమార్ టీమ్ కూడా ఏం చేయలేకపోయారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా అంటే మొత్తంగా మూవీ అవుట్ పుట్ పైనే ఎఫెక్ట్ పడుతుందని సుక్కూ కూడా కామ్ గా ఉన్నాడట. దీంతో పాటు నిర్మాణ సంస్థ కూడా సుకుమార్ కు ఇష్టం. వారికి నష్టం కలగకుండా ఉండేందుకు కూడా ఆయన కామ్ గా ఉన్నాడంటున్నారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. కానీ అల్లు అర్జున్ .. సుక్కూ అభ్యంతరాలను లైట్ తీసుకున్నాడని టాక్. దీంతో హర్ట్ అయిన సుకుమార్.. పుష్ప సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ చేయొద్దని నిర్ణయించకున్నాడంటున్నారు.
సెకండ్ పార్ట్ మేటర్ పక్కన బెడితే.. రీసెంట్ గా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అటెండ్ కాలేదు. దానికి ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో ఉన్నాడని చెప్పారు కానీ.. ఆయన పనిలో ఉంది ఎంత నిజమో.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావడానికి ఇష్టపడలేదు అనేది కూడా అంతే నిజం అని సుక్కూ టీమ్ నుంచి వినిపించే మాట. ఏదేమైనా అల్లు అర్జున్ తీరుతో సుకుమార్ చాలా బాధపడ్డాడనే టాక్ కూడా ఉంది. మరి ఈ కాంబినేషన్ తర్వాతి సినిమాకూ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కంటిన్యూ అయితే ఈ సారి ఖచ్చితంగా సుకుమార్ కండీషన్స్ పెడతాడు. దానికి ఓకే అంటేనే పుష్ప -2 సెట్స్ పైకి వెళుతుంది.