Allu Arjun : సుకుమార్ రెడ్డి.. సోషల్ మీడియాలో కొత్త చర్చ..!
Allu Arjun లేటెస్ట్ గా మళ్లీ అలాంటి తప్పిదమే చేశాడు. తనతో పుష్ప 1, 2 సినిమాలు తీసిన డైరెక్టర్ సుకుమార్ పేరుని తప్పుగా పలికాడు. అదేంటి అనుకోవచ్చు. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్
- By Ramesh Published Date - 08:59 PM, Thu - 12 December 24

పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా పుష్ప 2 (Pushpa 2) నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించింది. ంతేకాదు నార్త్ లో ఈ సినిమా దూకుడు చూస్తుంటే 1500 నుంచి 2000 కోట్ల దాకా కలెక్ట్ చేసేలా ఉంది. ఐతే పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ కాస్త కంగారు కూడా పడుతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయాడు.
లేటెస్ట్ గా మళ్లీ అలాంటి తప్పిదమే చేశాడు. తనతో పుష్ప 1, 2 సినిమాలు తీసిన డైరెక్టర్ సుకుమార్ పేరుని తప్పుగా పలికాడు. అదేంటి అనుకోవచ్చు. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్ (Sukumar). కానీ నేడు ఢిల్లీలో అల్లు అర్జున్ (Allu Arjun) బండి సుకుమార్ రెడ్డి అని చెప్పాడు. అసలే ఎక్కడ దొరుకుతాడా ట్రోల్ చేద్దామని చూస్తున్న యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు.
ఆర్య నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ తో సూర్య దాదాపు 20 ఏళ్ల దాకా పనిచేశాడు. అలాంటి సుకుమార్ ఇంతి పేరు, కమ్యునిటీ పేరు తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ అంటున్నారు. అయినా అందరికీ సుకుమార్ అని తెలిసిన పేరు ఉండగా ఎందుకు ఆయన ఇంటి పేరుని చెప్పాలనుకున్నాడా అన్నది తెలియదు. పోనీ చెప్పేది కరెక్ట్ గా చెప్పాడా అంటే కానే కాదు.
బండి సుకుమార్ రెడ్డి (Sukumar Reddy) కాదు బండ్రెడ్డి సుకుమార్.. ఈలోగా ఈ వీడియో కాస్త వైరల్ అయ్యి కొందరు సుకుమార్ గురించి సొషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.